Wednesday, September 16, 2009

వైరాగ్యం vs సోమరితనం

వైరాగ్యం అంటే.. చేసే కర్మయందు ఫలాపేక్ష లేకపోవటం. కర్మ చేయకపోవటం కాదు!

కేవలం కర్మ చేయకుండా ఉండటం, సోమరితనం. సోమరితనం లో (ఫల)ఆపేక్ష ఉంటుంది. అది తామసిక ప్రవృత్తి.

Saturday, September 12, 2009

Mahopadesam from Sri Ramana

కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం

కర్మకిం పరం కర్మ తజ్జడం

గణపతి రూపములు.

కృత యుగం:-
మహోత్కట వినాయకుడు. గణపతి మొదటి అవతారం. 10 భూజములు. శుద్ధ స్ఫటిక రంగు, రూపం. సింహ వాహనం.

త్రేతా యుగం (1296000 సంవత్సరములు యుగ పరిమాణం):-
మయూర గణపతి. నెమలి వాహనం. 8 భూజములు. పగడపు రంగు, రూపం. సింధురాసుర వధ.

ద్వాపర యుగం (యుగ పరిమాణం 864000 సంవత్సరములు):-
పార్వతీ దేవి నలుగు పిండి నుంచి పుట్టిన వాడు. మట్టి వినాయకుడు. మూషిక వాహనం. గజానన గణపతి. 4 భూజములు. (శశి వర్ణం చతుర్భుజం. పసుపు రంగు. ముషికాసుర వధ.

కలి యుగం (యుగ పరిమాణం 432000 సంవత్సరములు):-
స్వయంభు గణపతి. ధూమ (పొగ) రంగు. కలియుగ ప్రథమ పాద అనంతరం అవతరిస్తాడు. అశ్వ వాహనం. దుర్మార్గులను సంహరిస్తాడు. ద్విభుజములు.

ఈ పై రూపములు తప్ప వేరే రూపాలు పూజించ కూడదు అని గణేశ పురాణం చెప్తోంది.

శివస్థలములు

కంచి, జంబుకేశ్వరం, అరుణాచలం, శ్రీకాళహస్తి, చిదంబరం - పంచభూత క్షేత్రాలు.

కోణార్క్, సీతాకుండ్, పశుపతినాథ్ తో కలిపి అష్ట శివ క్షేత్రాలు.